Hyderabad, సెప్టెంబర్ 8 -- స్టార్ మా సీరియల్స్ లో మంచి టీఆర్పీ రేటింగ్స్ సాధించే వాటిలో ఒకటి నువ్వుంటే నా జతగా. ఈ సీరియల్ మొదలైనప్పటి నుంచి మంచి రేటింగ్ సాధిస్తూ వస్తోంది. ప్రతి రోజూ రాత్రి 9.30 గంటలకు ప్రసారమయ్యే ఈ సీరియల్ ఇక నుంచి సాయంత్రం 6 గంటలకే రానున్నట్లు ఆ ఛానెల్ వెల్లడించింది.

స్టార్ మాలోని టాప్ సీరియల్స్ లో ఒకటి నువ్వుంటే నా జతగా. కొన్ని నెలల కిందట మొదలైన ఈ సీరియల్ వచ్చీ రాగానే టాప్ 10లోకి దూసుకొచ్చింది. కొన్నాళ్లుగా నిలకడగా ఐదు లేదా ఆరోస్థానంలో ఉంటూ వస్తోంది. ఇంత వరకు సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజూ రాత్రి 9.30 గంటలకు ఈ సీరియల్ టెలికాస్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు ఆ టైమ్ మార్చేశారు.

ఈ సోమవారం (సెప్టెంబర్ 8) నుంచి సాయంత్రం 6 గంటలకే ఈ సీరియల్ ను ప్రసారం చేయనున్నట్లు స్టార్ మా వెల్లడించింది. దీనికి కారణం బిగ్ బాస్ తెలుగు కొత...