భారతదేశం, ఫిబ్రవరి 20 -- ప్రతి ఏటా హోలీ పండుగను అందరూ సరదాగా జరుపుకుంటారు. హోలీని రంగులతో కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంతోషంగా జరుపుతారు. అయితే ఈ ఏడాది హోలీ పండుగ మార్చి 4న వచ్చింది. పైగా అదే రోజు శుక్రుడి సంచారంలో మార్పు జరగబోతోంది. శుక్రుడు సంపద, సంతోషం, విలాసాలు, డబ్బు మొదలైన వాటికి కారకుడు. శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. పైగా అదే సమయంలో శనితో సంయోగం చెందుతాడు. ఇది కొన్ని రాశుల వారికి వరం వంటిది.

ఈ రాశుల వారు అనేక విధాలుగా లాభాలను పొందుతారు, పురోగతిని చూస్తారు. ప్రేమ జీవితంలో కూడా సంతోషం పెరుగుతుంది. ఎప్పటి నుంచో పూర్తి కాని పనులను కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఏ రాశుల వారికి హోలీ సందర్భంగా కలిసి రాబోతోంది? ఎవరు లాభాలను పొందబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి వారికి ఈ సమయం బాగా కలిసి వస్తు...