భారతదేశం, ఏప్రిల్ 30 -- అక్షయ తృతీయ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్​ నుంచి బిగ్​ అప్డేట్​ వచ్చింది. తన పోర్ట్​ఫోలియోలోని ఎలక్ట్రిక్​ వాహనాలపై రూ. 40వేల వరకు డిస్కౌంట్​ని ఇస్తోంది ఈ ఈవీ తయారీ సంస్థ. ఫెస్టివల్ డిస్కౌంట్​తో పాటు ఎక్స్​టెండెడ్​ బ్యాటరీ వారంటీని కూడా ఉచితంగా అందిస్తోంది. అయితే ఈ ప్రయోజనాలు ఏప్రిల్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి.

డిస్కౌంట్స్​ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్​ జెన్​ 2 మోడల్స్​ రూ. 67,499 వద్ద, జెన్​ 3 మోడల్స్​ రూ. 73,999 వద్ద మొదలవుతాయి. అంతేకాదు, క్యాంపైన్​ సమయంలో కొన్ని ఎంపిక చేసిన రాష్ట్రాల్లో సేమ్​-డే డెలివరీకి కూడా ఓలా ఎలక్ట్రిక్​ హామీ ఇస్తోంది.

కస్టమర్లు ఓలా ఎలక్ట్రిక్​ ఆన్​లైన్​ లేదా ఆఫ్​లైన్​ స్టోర్స్​లో ఎలక్ట్రిక్​ స్కూటర్లను కొనుగోలు చేసుకోవచ్చు. గంటలోనే ఫుల్లీ రిజిస్టర్డ్​ వెహికిల్​ పొందొచ్చ...