Hyderabad, సెప్టెంబర్ 29 -- ఈవారం ఓటీటీల్లో మిస్ కాకుండా చూడాల్సిన మూడు మలయాళం సినిమాలు ఏవో ఇక్కడ చూడండి. సన్ నెక్ట్స్, లయన్స్‌గేట్ ప్లేలాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఈ మూవీస్ వస్తున్నాయి. ఓనమ్ కు రిలీజై మంచి టాక్ సంపాదించిన మైనే ప్యార్ కియా అనే సినిమా కూడా ఇందులో ఉంది.

మలయాళం క్రైమ్ కామెడీ మూవీ ఈ బుధవారం (అక్టోబర్ 1) సన్ నెక్ట్స్ ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈ కథలో మెయిన్ క్యారెక్టర్స్ అయిన యంగ్ కపుల్ జీవన్, సెరా చాలా ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. కానీ సెరా ఫ్యామిలీ ఆమెను మరొక వ్యక్తిని పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తుంది. దాంతో ఆమె జీవన్‌తో కలిసి పారిపోవడానికి చాలాసార్లు ట్రై చేస్తుంది.

ఈలోగా "వోల్ఫ్" అని పిలిచే ఒక క్రిమినల్.. జీవన్, తన ఫ్రెండ్స్‌తో జాయిన్ అవ్వడంతో గందరగోళం మొదలవుతుంది. అనుకోకుండా తన వైఫ్‌పై అనుమానం ఉన్న ర...