Hyderabad, జూలై 14 -- ఓటీటీలోకి ప్రతివారం ఏయే సినిమాలు, వెబ్ సిరీస్ రానున్నాయో ముందుగానే ఆయా ప్లాట్‌ఫామ్స్ అనౌన్స్ చేస్తుంటాయి. ఈవారం కూడా అలా ఎన్నో మూవీస్, సిరీస్ రానున్నాయి. అయితే వాటిలో చూడాల్సిన టాప్ 5 మూవీస్, వెబ్ సిరీస్, షోల జాబితాను మేము ఇక్కడ ఇస్తున్నాం. ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, జీ5, జియోహాట్‌స్టార్ లాంటి ఓటీటీల్లో వీటిని చూడొచ్చు.

ఈవారం ఓటీటీలోకి వస్తున్న తెలుగు బ్లాక్‌బస్టర్ మూవీ కుబేర. జూన్ 20న థియేటర్లో రిలీజై బాక్సాఫీస్ దగ్గర రూ.130 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ సినిమా.. నెల రోజుల్లోపే అంటే ఈ శుక్రవారం (జులై 18) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది. ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా నటించిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. శేఖర్ కమ్ముల చాలా రోజుల తర్వాత మరోసారి తన మార్క్ మూవీ అందించాడు. ఈ సినిమాను ఓటీటీలో...