భారతదేశం, అక్టోబర్ 29 -- ఓటీటీలోకి ప్రతివారం లాగే ఈవారం కూడా కొన్ని మంచి మలయాళం సినిమాలు వస్తున్నాయి. వీటిలో తొలి ఫిమేల్ సూపర్ హీరో మూవీ లోకా: ఛాప్టర్ 1తోపాటు మరో రెండు మూవీస్ కూడా ఉన్నాయి. మరి వీటిని ఎక్కడ, ఎప్పుడు చూడాలన్న వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
మలయాళం ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీ లోకా ఛాప్టర్ 1 చంద్ర ఈవారమే ఓటీటీలోకి వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా.. ఇప్పుడు జియోహాట్‌స్టార్ లోకి వస్తోంది. ఈ శుక్రవారం అంటే అక్టోబర్ 31 నుంచి ఏడు భాషల్లో ఈ మూవీని చూడొచ్చు.
కల్యాణి ప్రియదర్శన్, నస్లేన్ లీడ్ రోల్స్ లో నటించారు. మలయాళం ఇండస్ట్రీలో రూ.300 కోట్ల మార్క్ దాటిన తొలి సినిమాగా నిలిచిన ఈ లోకా మూవీ కోసం ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగులో కొత్త లోక పేరుతో ఈ సినిమా వచ్చింది...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.