Hyderabad, సెప్టెంబర్ 26 -- ఓటీటీలోకి ఈవారం వివిధ భాషల్లో ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ వచ్చాయి. మరి ఒక్కో భాషలో ఒక్కో ఓటీటీలో ఉన్న ఆ కంటెంట్ ఏంటో తెలుసుకోండి. దసరా హాలిడేస్ లో మీ పిల్లలతో కలిసి వీటిని ఎంజాయ్ చేయండి. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల సినిమాలు, వెబ్ సిరీస్ వీటిలో ఉన్నాయి.

అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు నటించిన ఘాటి మూడు వారాల్లోనే ఈ శుక్రవారం (సెప్టెంబర్ 26) అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి అడుగుపెట్టింది. తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మలయాళంలలో ఈ మూవీ చూడొచ్చు. సెప్టెంబర్ 5న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచిపోయింది.

ఇక మలయాళం నుంచి చాలా సినిమాలే ఈవారం రాగా అందులో మోహన్‌లాల్ నటించిన హృదయపూర్వం టాప్ ఛాయిస్ గా చెప్పొచ్చు. జియోహాట్‌స్టార్ లోకి ఈ మూవీ వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లకుపైగా వసూలు చేసిన...