Hyderabad, సెప్టెంబర్ 11 -- ఓటీటీలోకి ఈవారం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలకు చెందిన వివిధ సినిమాలు, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. మరి వీటిలో మిస్ కాకుండా చూడాల్సిన బ్లాక్‌బస్టర్ మూవీస్, సిరీస్ ఏవో చూడండి. వీటిని ఏయే ఓటీటీల్లో చూడాలో తెలుసుకోండి.

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ మూవీ గురువారమే (సెప్టెంబర్ 11) ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చింది. మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినా బాక్సాఫీస్ దగ్గర రూ.500 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ సినిమా తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి ఓటీటీలో మరింత మెరుగైన రెస్పాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఈవారం ఇప్పటికే ఓటీటీలోకి వచ్చిన కన్నడ బ్లాక్‌బస్టర్ హారర్ కామెడీ మూవీ సు ఫ్రమ్ సో. ఈ సినిమా జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఏడాది అత్యధిక వసూళ్...