భారతదేశం, ఆగస్టు 3 -- నీట్ పీజీ 2025 పరీక్షను ఆదివారం, ఆగస్టు 3, 2025న నిర్వహించనుంది నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్​బీఈఎంఎస్​). ఈ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఒకే షిఫ్ట్‌లో జరుగుతుంది. వైద్య రంగంలో కీలకమైన ఈ పరీక్షకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు చివరి నిమిషంలో హడావుడి పడకుండా, కొన్ని ముఖ్యమైన నియమాలను గుర్తుంచుకోవడం అవసరం. ఈ నేపథ్యంలో నీట్​ పీజీ 2025 అభ్యర్థుల కచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలను ఇక్కడ చూడండి..

రిపోర్టింగ్ టైమ్​: పరీక్షా కేంద్రం గేటు ఉదయం 8:30 గంటలకు మూసివేస్తారని గుర్తుపెట్టుకోవాలి. అంటే, అభ్యర్థులు అంతకంటే ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. ఎన్​బీఈఎంఎస్​ ప్రకారం.. అభ్యర్థులు సకాలంలో ప్రాంగణానికి చేరుకుని, పరీక్షా కేంద్రంలోకి ఎంట్రీని ముందుగానే తెలు...