భారతదేశం, ఫిబ్రవరి 5 -- వయసు పెరుగుతున్నా తరగని అందం మలైకా అరోరా సొంతం. ఐటెం సాంగ్స్ క్వీన్ అయిన ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎప్పుడూ తన ఫిట్‌నెస్, ఫ్యాషన్‌తో వార్తల్లో నిలిచే ఈ భామ.. తాజాగా తన కొత్త హెయిర్ స్టైల్‌తో దర్శనమిచ్చింది. గురువారం (ఫిబ్రవరి 5) ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ప్రముఖ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ అమిత్ యశ్వంత్ తాజాగా మలైకా అరోరాకు ఓ కొత్త హెయిర్ స్టైల్ సెట్ చేశాడు. ఈ ఫొటోలను షేర్ చేస్తూ.. "చాప్ చాప్.. నయా సాల్, నయా బాల్ (కొత్త సంవత్సరం, కొత్త జుట్టు)" అంటూ క్యాప్షన్ పెట్టింది.

ఈ లేటెస్ట్ ఫొటోల్లో మలైకా నలుపు రంగు డీప్ నెక్ బాడీసూట్, హై-వెస్ట్ లెదర్ ప్యాంట్‌ ధరించి స్టైలిష్‌గా పోజులిచ్చింది. ముఖ్యంగా ఆమె కొత్తగా చేయించుకున్న 'కర్టెన్ బ్యాంగ్స్' (Curtain Ban...