భారతదేశం, మే 18 -- భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు ఎదురుదెబ్బ! ఈఓఎస్​- 09 ఎర్త్​ అబ్జర్వేషన్​ శాటిలైట్​తో కూడిన పీఎస్​ఎల్వీ- సీ61 (పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్) లాంచ్​ విఫలమైంది! ఫలితంగా ఈ మిషన్​ని ఇస్రో రద్దు చేసింది. ఈ విషయాన్ని ఇస్రో ఛైర్మన్​ వీ నారాయణ్​ ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్​ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఆదివారం ఉదయం 5:59 గంటలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఈఓఎస్-09ను ప్రయోగించింది. ఇస్రోకు ఇది 101వ ఉపగ్రహ ప్రయోగం. కాగా నింగిలోకి ఎగిరిన అనంతరం, 3వ దశ వచ్చేసరికి ప్రొపల్షన్​ సిస్టెమ్​లో లోపం కారణంగా రాకెట్​ నియంత్రణ కోల్పోయిందని తెలుస్తోంది.

రాకెట్​ నింగిలోకి ఎగిరిన 203వ సెకండ్​లో హెచ్​టీపీబీ (హైడ్రాక్సైల్​ టెర్మినేటెడ్​ పాలీబుటాడయీన్​) ప్రొపలెంట్​ సరిగ్గా పనిచేయలేదని సమాచారం. అందుకే రాకెట్​ విఫలమైంది. పీఎస్​...