భారతదేశం, ఏప్రిల్ 20 -- డబ్బు అవసరం ఉన్నప్పుడు ముందుగా గుర్తొచ్చేది పర్సనల్​ లోన్​! చాలా మంది ఈ తరహా లోన్​ తీసుకుని తమ ఖర్చుల కోసం వాడుకుంటూ ఉంటారు. అయితే ఇంకా డబ్బులు కావాల్సి వస్తే తీసుకున్న పర్సనల్​ లోన్​పై ఇంకో లోన్​ కూడా పొందే ఆప్షన్​.. బ్యాంక్​లు ఇస్తుంటాయి. దీన్నే 'టాప్​-అప్​' లోన్​ అంటారు. అయితే, ఇస్తున్నారు కదా అని ఏది పడితే అది, ఎంత పడితే అంత తీసేసుకుంటే మన మీద ఆర్థిక భారం చాలా పెరుగుతుంది. అప్పుల్లో కూరుకుపోతాము. ఈ నేపథ్యంలో అసలు టాప్-అప్ లోన్​ ఎంచుకునే ముందు, ఎలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి? అన్న విషయాన్ని ఇక్కడ తెలుసుకోండి.

పెరిగిన రుణ భారం: టాప్-అప్ లోన్​ మీ ప్రస్తుత రుణానికి జోడిస్తుంది. అంటే మీ నెలవారీ చెల్లింపులు ఎక్కువగా ఉంటాయి. రుణం తీసుకునే ముందు ఈ అదనపు భారాన్ని తిరిగి చెల్లించగలరా? లేదా? అని చెక్​ చేయడం చాలా ము...