Hyderabad, మే 9 -- టాలీవుడ్ కు ఈ శుక్రవారం (మే 9) కాస్త కలిసొచ్చిందనే చెప్పాలి. రెండు చిన్న సినిమాలు రిలీజైనా రెండింటికీ పాజిటివ్ టాకే వచ్చింది. వీటిలో ఒకటి సమంత నిర్మించిన శుభం మూవీ కాగా.. మరొకటి శ్రీవిష్ణు నటించిన సింగిల్. మరి ఈ సినిమాలు ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ లోకి అడుగుపెడుతున్నాయో ఒకసారి చూద్దాం.

శ్రీవిష్ణు నటించిన సింగిల్ మూవీ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. మంచి ధరకు ఈ సినిమాను దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకూ శ్రీవిష్ణు సినిమాలకు వచ్చిన అత్యధిక మొత్తం ఇదే కావడం విశేషం. సింగిల్ మూవీకి పాజిటివ్ రివ్యూలు రావడంతో డిజిటల్ ప్రీమియర్ ఎప్పుడున్న ఆసక్తి నెలకొంది. ఈ సినిమా వచ్చే నెలలోనే ఓటీటీలోకి అడుగుపెట్టనుంది.

ఓ అమ్మాయితో తొలిచూపులోనే ప్రేమ‌లో ప‌డ్డ యువ‌కుడు.. అత‌డిని ఇష్ట‌ప‌డ్డ మ‌రో అమ్మాయి.. ఈ ముగ్...