భారతదేశం, జనవరి 3 -- బిహార్​లో జరిగిన ఒక షాకింగ్​ ఘటన ఇప్పుడు వార్తల్లొ నిలిచింది! రైల్వే ట్రాక్​పై పబ్​జీ ఆడుకుంటుండగా.. ముగ్గురు యువకులపైకి రైలు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

బిహార్​ పశ్చిమ్​ చంపారణ్​ జిల్లాలోని మాన్సా టోలా కిందకు వచ్చే నర్కటియాగంజ్​- ముజాఫర్​పూర్​ రైల్​ సెక్షన్​పై గురువారం ఈ ఘటన జరిగింది. ముగ్గురు రైల్వే ట్రాక్​పై కూర్చుని ఇయర్​ఫోన్స్​ పెట్టుకుని పబ్​జీ ఆడటంలో మునిగిపోయారు. ఫలితంగా, ఎదురుగా వస్తున్న రైలు గురించి వారికి తెలియలేదు, శబ్దం వినిపించలేదు. కొన్ని క్షణాల్లోనే వారి మీద నుంచి రైలు దూసుకెళ్లింది. ఆ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

రైల్వే ట్రాక్​పై మృతదేహాలను చూసేందుకు స్థానికులు తరలివెళ్లారు. భారీ సంఖ్యలో గుమిగూడి, రైలు ప్రమాదంలో చితికిపోయిన మృతదేహాలను చూసి షాక్​కు గురయ్యారు.

మృతులను రైల్...