భారతదేశం, అక్టోబర్ 27 -- నయనతార సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్దాలకుపైనే అయింది. అటు తమిళంతోపాటు తెలుగులోనూ ఎన్నో హిట్స్ అందుకొని లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. ఇప్పుడు చాలా రోజుల తర్వాత చిరంజీవితో కలిసి మన శంకర వరప్రసాద్ గారులో నటిస్తున్న ఆమె.. ఆ వెంటనే మరో తెలుగు మూవీ చేయబోతోంది. అది కూడా బాలకృష్ణతో కావడం విశేషం.

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రాబోతున్న ఓ పీరియడ్ యాక్షన్ మూవీలో నయనతార నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే బాలయ్యతో ఆమె జత కట్టడం ఇది నాలుగోసారి అవుతుంది. ఇప్పటికే అతనితో కలిసి సింహా, శ్రీరామ రాజ్యం, జై సింహా సినిమాలను ఆమె చేసింది.

ఇవన్నీ బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ కొట్టాయి. ఇక ఇప్పుడు మరో సినిమా చేస్తుందన్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. 2023లో బాలయ్యతో వీర సింహారెడ్డి మూవీ తీసి హిట్ కొట్టిన గో...