భారతదేశం, ఏప్రిల్ 18 -- కేఎల్ రాహుల్, అతియా శెట్టి దంపతుల కూతురు ఇన్‌స్టాగ్రామ్‌ డెబ్యూ చేసింది. ఆ చిన్నారి ఫొటోను ఈ కపుల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. రాహుల్ ఆ పాపను ఎత్తుకుని ఉండగా.. ఆమె ముఖాన్ని ప్రేమతో చూస్తున్న అతియా స్టిల్ అదిరిపోయింది. అయితే ఆ పాప ఫేస్ ను మాత్రం రివీల్ చేయలేదు. కేఎల్ రాహుల్ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం (ఏప్రిల్ 18) తమ పాప పేరును కూడా వీళ్లు వెల్లడించారు.

కేఎల్ రాహుల్, అతియా తమ పాపకు 'ఇవారా' అనే పేరు పెట్టారు. 'మా చిన్నారి పాప. మా సర్వస్వం. ఇవారా.. దేవుని బహుమతి' అని వీళ్లు ఫొటోతో పాటు చిన్నారి పేరును ఇన్‌స్టాగ్రామ్‌లొ అనౌన్స్ చేశారు. ఇవారా అంటే దేవుని బహుమతి అని అర్థం. మార్చి 24న కేఎల్ రాహుల్-అతియా దంపతులకు పాప జన్మించిన సంగతి తెలిసిందే. భార్య డెలివరీ కోసం ఐపీఎల్ 2025 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి మ్యాచ్ కు ...