భారతదేశం, ఏప్రిల్ 24 -- విజయవాడ మాచవరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఇన్‌స్టా గ్రామ్‌లో పరిచయమైన యువకుడు పిలిచాడని హోటల్‌కు వెళ్లిన యువతి నిలువుదోపిడీకి గురైంది.

విజయవాడ మాచవరంలో హోటల్లో ఏకాంతంగా ఉన్న సమయంలో యువతిని ఆమె దుస్తులతోనే బంధించి ఆమె దగ్గర ఉన్న నగలతో ఉడాయించాడు. ఈ ఘటనపై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విజయవాడకు చెందిన యువతికి ఇన్ స్టా గ్రామ్‌లో నెల రోజుల క్రితం ఓ యువకుడు పరిచయం అయ్యాడు.

ఇద్దరి తరచూ మాట్లాడుకున్నారు. ముక్కు ముఖం తెలియని యువకుడితో యువతి చనువు పెంచేసుకుంది. యువకుడి మాటలు నమ్మేసి యువతి అతడి ఉచ్చులో చిక్కిన తర్వాత ఆమెను ఏకాంతంగా కలవాలని పిలిచాడు.

దీంతో మంగ ళవారం సాయంత్రం మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న హోటల్‌కు రమ్మని ఆమెని పిలిచాడు. హోటల్ గదిలోకి వెళ్లగానే ఆమె శరీరంపై దుస్తులు...