భారతదేశం, జూన్ 28 -- మీరు రూ. 5 లక్షల వరకు ఇన్​స్టెంట్​ పర్సనల్​ లోన్​ కోసం చూస్తున్నట్లయితే, సాంకేతిక పురోగతితో ఇప్పుడు వేగంగా, సులభంగా రుణం పొందవచ్చు. అయితే, రుణాన్ని అందించే సంస్థలు సూచించిన కొన్ని ముఖ్యమైన పత్రాలను సమర్పించడం, ప్రాథమిక అర్హత ప్రమాణాలను తీర్చడం తప్పనిసరి. అనేక బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు (బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు) ఇప్పుడు తక్కువ పత్రాలతో, వేగంగా డిజిటల్ పద్ధతిలో రుణాలను మంజూరు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పర్సనల్​ లోన్​కి కావాల్సిన డాక్యుమెంట్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

పర్సనల్​ లోన్​లు అనేవి బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు అందించే అన్‌సెక్యూర్డ్ క్రెడిట్‌లు. ఇవి వైద్య ఖర్చులు, విద్య, ప్రయాణం లేదా అప్పులను క్రమబద్ధీకరించడం వంటి తక్షణ అవసరాలను తీర్చడానికి ఉపయోగపడతాయి. ఈ వ్యక్తిగత రుణాలకు ఎలాంటి హామీ (కొలేటరల్) అవసరం ల...