భారతదేశం, ఆగస్టు 6 -- ఇన్‌స్టెంట్​ పర్సనల్ లోన్‌లు అంటే.. విద్య, వైద్య ఖర్చులకు లేదా ఇంటి మరమ్మతులకు తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చడానికి బ్యాంకింగ్‌ సంస్థలు అందించే అన్​సెక్యూర్డ్​ రుణాలు. సాధారణంగా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు వీటిని అతి త‌క్కువ లేదా ఎలాంటి పేప‌ర్ వ‌ర్క్ లేకుండానే సులభంగా అందిస్తాయి. ఈ లోన్‌లు 24 నుంచి 48 గంటల్లో మంజూరవుతాయి. అయితే ఇవి ఎంత సౌకర్యంగా, సౌలభ్యంగా ఉన్నా.. స‌రిగ్గా ప్లాన్ చేసుకోకుండా తీసుకుంటే, రుణ భారం పెరిగి దీర్ఘ‌కాలిక ఆర్థిక ఇబ్బందులకు దారితీయవచ్చు. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాంట్ పర్సనల్ లోన్‌ తీసుకునేటప్పుడు సాధారణంగా చేసే ఐదు ఖరీదైన తప్పుల గురించి ఇక్కడ తెలుసుకోండి..

రుణ సంస్థలు ఎక్కువ‌ మొత్తాన్ని మంజూరు చేస్తున్నాయ‌ని చెప్పి, మీరు మీ అవసరానికి మించి ఎక్కువ పర్సనల్​ లోన్ తీసుకోవడం వల్ల నెలవారీ ఈఎంఐ భారం పెరుగుతుంద...