Hyderabad, జూన్ 2 -- రామ్‌గోపాల్ వర్మ అంటేనే సంచలనాలకు మారు పేరు. ఈ మధ్య సినిమాల కంటే తన ట్వీట్స్, కామెంట్స్ తోనే వార్తల్లో ఉంటున్నాడు. ఇక ఇప్పుడు కమల్ హాసన్ కన్నడ భాషా వివాదంపై స్పందించాడు. సోమవారం (జూన్ 2) అతడు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఇదో కొత్త రకంగా గూండాయిజం అని వర్మ అంటున్నాడు.

ఏ అంశంపై అయినా తన అభిప్రాయాలను ఉన్నది ఉన్నట్లుగా వ్యక్తపరిచే రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు కమల్ హాసన్ వివాదంపైనా తనదైన స్టైల్లో స్పందించాడు. కమల్ హాసన్ క్షమాపణ చెప్పకపోతే థగ్ లైఫ్ మూవీని రిలీజ్ కానివ్వబోమని కన్నడ సంఘాలు హెచ్చరించడం ఓ కొత్త రకం గూండాయిజం అని ఆర్జీవీ అభిప్రాయపడ్డాడు.

"ప్రజాస్వామ్యానికి కొత్త పేరు అసహనం. అందులోని నిజానిజాల సంగతిని పక్కన పెడితే కమల్ హాసన్ క్షమాపణ చెబితేనే థగ్ లైఫ్ మూవీని కర్ణాటకలో రిలీజ్ చేయనిస్తామన్నది ఓ కొత్త రకం గూండాయిజమే ...