భారతదేశం, జనవరి 1 -- న్యూ ఇయర్ 2026కు అంతా స్వాగతం పలికారు. అయితే ఈసారి హైదరాబాద్ పోలీసులు ఎటువంటి ఘటనలు జరగకుండా.. ముందస్తుగానే కఠిన ఆంక్షలు విధించారు. ఎలాంటి ప్రమదాలు జరగకూడదని ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు. పబ్బులు, క్లబ్బుల దగ్గర నుంచి తాగి వాహనాలు నడపొద్దని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. జరిమానాలు భారీగా ఉంటాయని చెప్పారు. దీంతో జనాలు కూడా జాగ్రత్తగా న్యూఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.

హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకల సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. నగరంలో ఎటువంటి సంఘటనలు లేకుండా నూతన సంవత్సర వేడుకలు జరిగాయని, పెద్ద ప్రమాదాలు ఏవీ జరగలేదని హైదరాబాద్ సీపీ సజ్జనార్ చెప్పారు. పోలీసుల కఠినమైన ఆంక్షలు, నగరం అంతటా అవగాహన ప్రచారాలతో సురక్షితంగా న్యూ ఇయర్ జరుపుకొన్నారని సజ్జనార్ చెప్పారు.

రోడ్డు భద్రతను నిర్ధారించడంలో పోలీసులు, పౌరుల సమిష్టి...