భారతదేశం, ఆగస్టు 5 -- అమెరికా జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని, తమ దేశంలోకి వచ్చే కొందరు విదేశీ సందర్శకులపై 15,000 డాలర్లు (సుమారు రూ. 13.17 లక్షలు) విలువ చేసే బాండ్ విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రభుత్వం నిర్ణయించింది. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలో అక్రమంగా ఉండేవారిపై కఠినంగా వ్యవహరించాలన్న ఉద్దేశంతో ఈ కొత్త ప్రయోగాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.

ఫెడరల్ రిజిస్టర్ నోటీసు ప్రకారం.. 'వీసా ఓవర్​ స్టే' (వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలో ఉండిపోవడం) ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వస్తున్న సందర్శకులపై ఈ బాండ్ విధించే అధికారం అగ్రరాజ్య కాన్సులర్ అధికారులకు ఉంటుంది. అలాగే, నిఘా- తనిఖీ సమాచారం సరిపడా లేదని భావించే దేశాల నుంచి వచ్చేవారికి కూడా ఈ బాండ్‌ను వర్తింపజేయవచ్చు.

నోటీసులో విదేశీయులను ఏలియన్స్​గా సంబోధించారు. "...