భారతదేశం, ఫిబ్రవరి 1 -- రాష్ట్రంలో ఇళ్లు లేని పేదల విషయంలో తెలంగాణ సర్కార్ మరో ఆలోచన చేస్తోంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ను పట్టాలెక్కించగా. చాలా చోట్ల లబ్ధిదారులు నిర్మాణాలు పూర్తి చేసుకుంటున్నారు. గృహా ప్రవేశాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ ఇళ్లను కేవలం ఖాళీ స్థలాలు ఉన్నవారికి మాత్రమే కేటాయించారు.

ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కోసం ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 జాబితాలను రూపొందించిన సంగతి తెలిసిందే. ఎల్ 1 కింద ఖాళీ జాగ ఉన్నవారి వివరాలను నమోదు చేయగా. ఎల్ 2లో జాగలు లేని వివరాలను పొందుపరిచారు. ఇక ఎల్ 3లో ఉన్న వారిని అనర్హులుగా ప్రకటించారు. అయితే ఇళ్లు జాగలేని వారి కోసం ప్రభుత్వం మరో ఆలోచన చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించాలని భావిస్తోంది.

గత బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో మొత్తం 2.90 లక్షల ఇళ్లను మంజూరు చేశారు. ఇప్పటి...