భారతదేశం, మే 13 -- శాంసంగ్ తన కొత్త అల్ట్రా స్లిమ్ స్మార్ట్​ఫోన్​ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్​ని ఇండియాలో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ లాంచ్​తో, స్మార్ట్​ఫోన్స్​కి సంబంధించి కొత్త సెగ్మెంట్​ని ప్రారంభించినట్టు వివరించింది. ఈ మోడల్​ శాంసంగ్​ గెలాక్సీ ఎస్​ సిరీస్​లో చేరుతుందని వెల్లడించింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ థిక్​నెస్​ కేవలం 5.8 ఎంఎం! బరువు 163 గ్రాములు మాత్రమే. ఇది కంపెనీకి కొత్త ఎత్తు. గెలాక్సీ ఎస్25 అల్ట్రా 8.2 ఎంఎం థిక్​నెస్​, 218 గ్రాముల బరువు కలిగి ఉంది. గెలాక్సీ ప్రాసెసర్, ఆన్-డివైజ్ ఏఐ సామర్థ్యాల కోసం స్నాప్​డ్రాగన్​ 8 ప్రాసెసర్​ ఇందులో ఉంది. ఈ నేపథ్యంలో శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ ఫీచర్స్​తో పాటు ఇతర వివరాలను ఇక్కడ చూసేయండి..

శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ స్మార్ట్​ఫోన్​ని దాని స్లిమ్​నెస్, మన్నికైన బిల్ట్​ కోసం "ఇంజనీరింగ్ మా...