భారతదేశం, సెప్టెంబర్ 5 -- సిట్రోయెన్ ఇండియా తన కార్ల శ్రేణిని విస్తరిస్తూ, కొత్త బసాల్ట్ ఎక్స్ వేరియంట్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ అదనపు ఫీచర్లతో పాటు డిజైన్‌లో కూడా కొన్ని మార్పులను కలిగి ఉంది. బసాల్ట్ ఎక్స్ వేరియంట్ వివిధ ఇంజిన్ ఆప్షన్లు, ట్రిమ్ స్థాయిలలో అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో ఈ కారుకు సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

బసాల్ట్ ఎక్స్ 'యూ' వేరియంట్: 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తున్న ఈ వేరియంట్​ ఎక్స్​షోరూం ధర రూ. 7.95 లక్షలు.

బసాల్ట్ ఎక్స్ 'ప్లస్' వేరియంట్: దీనికి 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.2 లీటర్ పెట్రోల్ టర్బో ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. పెట్రోల్ ఇంజిన్ ఎక్స్​షోరూం ధర రూ. 9.42 లక్షలు కాగా, టర్బో ఇంజిన్ ఎక్స్​షోరూం ధర రూ. 10.82 లక్షలు.

టాప్-స్పెక్ 'మ్యాక్స్+' వేరియంట్: ఈ వేరియంట్ 1.2 లీటర్ పె...