Hyderabad, అక్టోబర్ 1 -- ఇండియాలో ప్రస్తుతం అత్యంత సక్సెస్‌ఫుల్ హీరోయిన్లు ఎవరు? ఈ ప్రశ్న వినగానే.. వెంటనే దీపికా పదుకోన్, ఆలియా భట్, నయనతార లాంటి పేర్లు వినిపిస్తాయి. కొంతమంది ఐశ్వర్య రాయ్ తన పాపులారిటీ కారణంగా ఈ లిస్ట్‌లో ఉండాలని వాదించవచ్చు. అటు ప్రియాంక చోప్రా తన అంతర్జాతీయ సక్సెస్ కారణంగా ఈ లిస్ట్‌లోకి వస్తుంది. వీళ్లలోనే ఒకరు ఇండియాలో రిచెస్ట్ హీరోయిన్ కావచ్చని భావిస్తారు. కానీ వీళ్లలో ఎవరూ ఆమె దరిదాపుల్లో కూడా లేరంటే నమ్మగలరా?

తాజాగా విడుదలైన హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ప్రకారం.. జూహీ చావ్లా ఇండియాలో రిచెస్ట్ హీరోయిన్ కావడం విశేషం. ఈ లిస్ట్ ప్రకారం ఆమె నెట్ వర్త్ ఆశ్చర్యకరంగా రూ.7790 కోట్లు (దాదాపు 880 మిలియన్ డాలర్లు). ఇది ఆమెను ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ధనిక నటులలో ఒకరిగా నిలబెట్టింది. జూహీ సంపద ఎక్కువగా సిని...