భారతదేశం, సెప్టెంబర్ 30 -- భారతదేశంలో పండుగ సీజన్ అనేది కార్ల కొనుగోలుదారులకు ఎప్పుడూ ఒక స్వీట్ స్పాట్! అయితే 2025 పండుగ సీజన్‌ మరింత ప్రత్యేకం! ఈసారి ఆఫర్లు, డిస్కౌంట్లతో పాటు జీఎస్టీ 2.0 ధరల హేతుబద్ధీకరణ కూడా తోడైంది. శాశ్వతమైన జీఎస్టీ తగ్గింపులు ఇప్పుడు డీలర్ల తాత్కాలిక పండుగ ఆఫర్లతో కలిసి వస్తున్నాయి. ఈ రెండూ కూడా ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ హ్యాచ్‌బ్యాక్‌లు, కాంపాక్ట్ సెడాన్‌లు, ఎస్‌యూవీలను అమాంతం తగ్గించేశాయి. వీటి వల్ల ఇటీవలి సంవత్సరాలలో ఎన్నడూ లేనంత భారీ పొదుపు పొందవచ్చు. ఈ నేపథ్యంలో బెస్ట్​ సెల్లింగ్​ కార్లు, వాటిపై పండుగ డిస్కౌంట్లను ఇక్కడ తెలుసుకోండి..

టాటా నెక్సాన్​పై ఏకంగా రూ. 2 లక్షల వరకు భారీ ప్రయోజనాలు లభిస్తున్నాయి! ఇందులో ప్రధానంగా రూ. 1.55 లక్షలు జీఎస్టీ-సంబంధిత తగ్గింపు రూపంలో, దాని అసలు ధరను సమర్థవంతంగా తగ్గించింది. ...