Hyderabad, జూలై 31 -- తెలుగులో ఎన్నో రకాల హారర్ థ్రిల్లర్ సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని హిట్ సాధిస్తే మరికొన్ని ఫ్లాప్‌గా మిగిలాయి. ఇప్పుడు తెలుగులో మరో న్యూ హారర్ థ్రిల్లర్ సినిమా రానుంది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కే ఈ హారర్ థ్రిల్లర్ సినిమాకు చేతబడిగా టైటిల్ పెట్టారు.

చేతబడి సినిమాను శ్రీ శారద రమణా క్రియేషన్స్ బ్యానర్‌పై నంద కిషోర్ నిర్మాణంలో నూతన దర్శకుడు సూర్యాస్ తెరకెక్కిస్తున్నారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. అంతేకాకుండా చేతబడి గురించి, మూవీ కథ గురించి డైరెక్టర్ సూర్యాస్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.

దర్శకుడు సూర్యాస్ మాట్లాడుతూ.. "చేతబడి అనేది 16వ శతాబ్దంలో మన ఇండియాలో పుట్టిన ఒక కళ. రెండు దేశాలు కొట్టుకోవాలన్నా.. రెండు దేశాలు కలవాలన్నా.. ఒక బలం బలగంతో ఉండాలి. కానీ...