భారతదేశం, ఆగస్టు 29 -- ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాపిల్ ఈవెంట్ సెప్టెంబర్ 9, 2025న జరగనుంది. ఈ ఈవెంట్‌లో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ అనే నాలుగు మోడళ్లను విడుదల చేయనున్నారు. ఈసారి కొత్త ఐఫోన్‌ల్లో మునుపటి మోడళ్ల కంటే గణనీయమైన అప్‌గ్రేడ్‌లు ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మార్పుల కారణంగా ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. తాజాగా, ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో మోడళ్ల అమెరికా ధరలు లీక్ అయ్యాయి. దీని ప్రకారం.. ధర 50 డాలర్ల వరకు పెరగవచ్చని తెలిసింది. కాబట్టి ఈసారి ఐఫోన్ 17 సిరీస్ మొత్తం ఖరీదైనదిగా మారే అవకాశం ఉంది! మరి ఐఫోన్ 17 సిరీస్ ధరలు ఎంత ఉండవచ్చో ఇక్కడ చూద్దాము...

యాపిల్ సెప్టెంబర్ లాంచ్ ఈవెంట్ దగ్గర పడుతున్న కొద్దీ, ఐఫోన్ 17 సిరీస్‌కు సంబంధించిన లీక్‌లు మరింత ఎక్కువవుతున్న...