భారతదేశం, ఆగస్టు 18 -- వియత్నాం ఆటోమొబైల్ దిగ్గజం విన్‌ఫాస్ట్.. భారత ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల మార్కెట్‌లో గణనీయమైన వాటాను దక్కించుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే వీఎఫ్​6, వీఎఫ్​7 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను విడుదల చేసిన ఈ సంస్థ, ఇప్పుడు మరిన్ని కొత్త ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగా.. 'లిమో గ్రీన్', 'మినియో గ్రీన్' అనే రెండు ఎలక్ట్రిక్ కార్లకు భారత్‌లో పేటెంట్ హక్కులను పొందింది. ఆ వివరాలు..

విన్‌ఫాస్ట్ ఇప్పటికే 'మినియో గ్రీన్' కోసం పేటెంట్ అప్లికేషన్‌ను దాఖలు చేసింది. ఇది ప్రస్తుతం భారతదేశంలోనే అత్యంత చిన్న, అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారుగా ఉన్న ఎంజీ కామెట్ ఈవీకి గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది. ఈ చిన్న ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ 3,100 మిల్లీమీటర్ల పొడవుతో ఎంజీ కామెట్ కంటే కొద్దిగా పొ...