భారతదేశం, ఫిబ్రవరి 20 -- ఇండియన్ పాప్ లవర్స్ కు గుడ్ న్యూస్. పాప్ సెన్సేషన్ షకీరా మరోసారి మన దేశానికి వస్తోంది. ముంబై, ఢిల్లీ నగరాల్లో ఆమె పర్ఫామ్ చేయబోతోంది. "హిప్స్ డోంట్ లై" (Hips Don't Lie) హిట్ సాంగ్ సృష్టికర్త అయిన ఆమె.. హెచ్‌ఎస్‌బీసీ సమర్పిస్తున్న 'డిస్ట్రిక్ట్ బై జొమాటో' వారి ఫీడింగ్ ఇండియా కాన్సర్ట్‌లో భాగంగా ఇండియాలో పర్ఫార్మ్ చేయబోతోంది.

"ఇండియాలో ప్రదర్శన ఇవ్వడం నాకు ఎప్పుడూ ప్రత్యేకమే. ముంబై, ఢిల్లీలోని నా అభిమానులతో మళ్లీ కనెక్ట్ అవ్వడానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను" అని గ్రామీ అవార్డు గ్రహీత, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన కొలంబియన్ సింగర్ షకీరా ఒక ప్రకటనలో తెలిపింది.

లాభాపేక్ష లేని 'ఫీడింగ్ ఇండియా' (Feeding India) లైవ్ మ్యూజిక్ జర్నీలో భాగమైన ఈ కాన్సర్ట్ గురించి షకీరా మాట్లాడుతూ.. "ప్రతి బిడ్డ అభివృద్ధి చెందడానికి అ...