భారతదేశం, ఆగస్టు 10 -- ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్​ ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తిగల అభ్యర్థులు ఐఓబీ అధికారిక వెబ్‌సైట్ iob.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 750 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 10, 2025న ప్రారంభమై ఆగస్టు 20, 2025తో ముగుస్తుంది. ఆన్‌లైన్ పరీక్ష ఆగస్టు 24, 2025న నిర్వహించడం జరుగుతుంది. అర్హత ప్రమాణాలు, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు రుసుము వంటి పూర్తి వివరాలను కింద చూడవచ్చు.

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అప్రెంటిస్​ పోస్టుల కోసం అప్లై చేస్తున్న అభ్యర్థులు భారత ప్రభుత్వం గుర్తించిన ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హత కలిగి ఉండాలి.

వయసు: జనరల్, ఈడబ్ల్యూఎస్​ అభ్యర్థులకు ఆగస్టు 1, 2025 నాటికి 2...