భారతదేశం, జూలై 18 -- ఇండియన్ బ్యాంక్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అప్లికేషన్​ ప్రక్రియను ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు ఇండియన్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ indianbank.in ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ నియామక ప్రక్రియ ద్వారా సంస్థలో మొత్తం 1500 అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేయనున్నారు.

ఇండియన్​ బ్యాంక్​ అప్రెంటీస్​ రిక్రూట్​మెంట్​ 2025 దరఖాస్తు ప్రక్రియ జులై 18న ప్రారంభమై.. ఆగస్టు 7, 2025తో ముగుస్తుందని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. పోస్టుల అర్హత, ఎంపిక ప్రక్రియ సహా ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఇండియన్​ బ్యాంక్​ అప్రెంటీస్​ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పట్టా లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఏదైనా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థులు తమ డిగ్ర...