భారతదేశం, ఏప్రిల్ 16 -- 'రాత్రికి రాత్రే కోటీశ్వరులం అయిపోతే ఎంత బాగుంటుంది?' అని మనలో చాలా మంది కలలు కంటూ ఉంటారు. కానీ అలా అవ్వాలంటే ఊహకు మించిన అద్భుతం జరగాలి. అదృష్టం కలిసిరావాలి. చిలీకి చెందిన ఓ వ్యక్తి జీవితంలో ఇదే జరిగింది! మరణించిన తండ్రికి సంబంధించిన ఒక బ్యాంక్​ పాస్​ బుక్​.. ఆ వ్యక్తిని రాత్రికి రాత్రే ధనవంతుడిని చేసేసింది. ఇంతకి ఏం జరిగిందంటే..

ఇది చిలీకి చెందిన ఎక్సిక్వియల్​ హినోజోసా అనే వ్యక్తి కథ. తన తండ్రి మరణించిన పదేళ్ల తర్వాత.. ఓసారి అయన వస్తువులను సర్దటం మొదలుపెట్టాడు ఎక్సిక్వియల్​. అప్పుడే, తన తండ్రికి చెందిన 6 దశాబ్దాల క్రితం నాటి పాత బ్యాంక్​ పాస్​ బుక్​ అతనికి దొరికింది. అది అతని అదృష్టాన్ని శాశ్వతంగా మార్చేసింది.

1960-70లో ఎక్సిక్వియల్​ తండ్రి ఒక ఇల్లు కొనడానికి డబ్బు పొదుపు చేశాడు. పాస్​ బుక్​ ప్రకారం ఎక్సిక్వియల...