భారతదేశం, జూలై 9 -- ఇంటెల్ సంస్థ ఈ నెలలో ఒరెగాన్ లో 529 మంది ఉద్యోగులను తొలగించనుంది. విస్తృత వ్యయ తగ్గింపు ప్రణాళికలో భాగంగా ఈ లే ఆఫ్ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. మొత్తం ఉద్యోగాల కోతలను ఇంటెల్ బహిరంగంగా ధృవీకరించలేదు. కానీ, జూలై 15 నుంచి అలోహా, హిల్స్ బోరోలోని ఇంటెల్ క్యాంపస్ లలో కార్యకలాపాలపై ఈ కోతలు ప్రభావం చూపుతాయని రెగ్యులేటరీ ఫైలింగ్ తెలిపింది.

ప్రముఖ చిప్ మేకర్ సంస్థ అయిన ఇంటెల్ కు ఏప్రిల్ లో కొత్తగా సీఈఓగా లిప్-బు టాన్ నియమితులయ్యారు. అంతర్జాతీయంగా ఇంటెల్ కోల్పోయిన తన సాంకేతిక పునాదిని తిరిగి పొందడానికి పెరుగుతున్న ఒత్తిడి మధ్య ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలోనే లే ఆఫ్స్ పై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సంస్థ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, పోటీతత్వాన్ని మెరుగుపరచడానికి తొలగింపులు అవసరమని శాంటా క్లారాక...