భారతదేశం, ఏప్రిల్ 23 -- ఏపీ ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించారు. ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు కొద్ది రోజుల క్రితం వెలువడ్డాయి. ఈ క్రమంలో విద్యార్థులకు అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ షెడ్యూల్‌ను ఫలితాలతో పాటు విడుదల చేశారు.

ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు చెల్లించడానికి గడువు ముగిసిన నేపథ్యంలో విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో గడువును పొడిగించారు. ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఏప్రిల్ 25వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు అనుమతిస్తారు. ఆర్ట్స్‌, సైన్స్‌ జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు ఇది వర్తిస్తుంది.

ఏపీలో ఇంటర్ ఫలితాలు ఇప్పటికే విడుదలయ్యాయి. ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. మే 12 నుంచి ఇంటర్ అడ్వా...