భారతదేశం, ఏప్రిల్ 26 -- నేచులర్ స్టార్ నాని ప్రస్తుతం హిట్ 3 ప్రమోషన్లలో బిజీబిజీగా ఉన్నారు. పాన్ ఇండియా రేంజ్‍లో జోరుగా ప్రచారం చేస్తున్నారు. హీరోయిన్ శ్రీనిధి శెట్టి కూడా యాక్టివ్‍గా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఈ సినిమా మే 1వ తేదీన విడుదల కానుంది. తాజాగా హిట్ 3 తమిళ వెర్షన్ కోసం ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు నాని, శ్రీనిధి. ఈ సందర్భంగా తన నచ్చిన చిత్రం గురించి నాని వెల్లడించారు.

మీకు నచ్చిన తమిళ చిత్రం ఏదంటూ నాని, శ్రీనిధి శెట్టికి ప్రశ్న ఎదురైంది. లబ్బర్ పందు అని శ్రీనిధి చెప్పారు. తనకు మేయళగన్ (తెలుగులో సత్యం సుందరం) చిత్రం చాలా నచ్చిందని నాని తెలిపారు. ఈ దశాబ్దంలోనే అది ఒకానొక బెస్ట్ సినిమా అని అన్నారు.

మేయళగన్ చిత్రం మ్యాజికల్ అని నాని చెప్పారు. "తమిళం అనే కాదు.. ఈ దశాబ్దం అంతటిలో నాకు నచ్చిన చిత్రాల్లో మేయళగన్ ఒకటి. చాలా అందమైన చిత్రం. ఏడ...