భారతదేశం, జనవరి 31 -- బాలీవుడ్ టాప్ హీరోయిన్ అలియా భట్ ఇప్పుడు తన జీవితంలోని అత్యంత అందమైన దశను ఆస్వాదిస్తున్నారు. 2022లో కూతురు రాహా కపూర్‌కు జన్మనిచ్చిన తర్వాత తల్లిగా ఆమె ప్రాధాన్యతలు పూర్తిగా మారిపోయాయి. తాజాగా 'ఎస్క్వైర్ ఇండియా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలియా భట్ తన వ్యక్తిగత జీవితం, కీర్తి ప్రతిష్టలు, తల్లి అయ్యాక వచ్చిన మార్పులు, సోషల్ మీడియాపై తనకున్న అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

సోషల్ మీడియా ఒత్తిడి గురించి అలియా భట్ స్పందిస్తూ.. "కొన్ని రోజులు నిద్రలేవగానే అసలు ఈ సోషల్ మీడియాను డిలీట్ చేసేయాలనిపిస్తుంది. కేవలం నటనపైనే దృష్టి పెట్టే ఒక నటిగా మాత్రమే ఉండాలని అనుకుంటాను. నిరంతరం ఏదో ఒక చర్చలో భాగం కావడం నాకు నచ్చదు. కానీ, మొదటి నుంచి నాకు అండగా నిలుస్తున్న లక్షలాది మంది అభిమానులతో సంబంధాలు తెగిపోతాయని భయం. అందుకే ఆ పన...