భారతదేశం, జూలై 1 -- వాహన కాలుష్యాన్ని కట్టడి చేసే దిశగా దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జులై 1, మంగళవారం నుంచి దిల్లీలోని పెట్రోల్ పంపుల్లో కాలం చెల్లిన (ఎండ్​ ఆఫ్​ లైఫ్​) వాహనాలకు ఇంధనం సరఫరా ఉండదు. వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ ఆదేశాల మేరకు రవాణా శాఖ, దిల్లీ పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ దిల్లీ సిబ్బంది ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నారు.

డీజిల్ వాహనాలకు 10 సంవత్సరాలు, పెట్రోల్ వాహనాలకు 15 సంవత్సరాల కాలపరిమితి దాటిన వెహికిల్స్​కి ఇంధనం నింపరు. ఈ వాహనాలకు ఇంధనం నింపకుండా పర్యవేక్షించడానికి, నిరోధించడానికి గుర్తించిన 350 పెట్రోల్ పంపుల్లో ఒక్కో ట్రాఫిక్ పోలీస్ అధికారిని నియమించారు.

ఎంసీడీ బృందాలు ఇంధన కేంద్రాల వద్ద మోహరించి ఉండగా, దిల్లీ పోలీసులు కూడా అక్కడ ఉంటారు. 1 నుంచి 100 వరకు నంబర్ ఉన్న పెట్రోల్ పం...