భారతదేశం, డిసెంబర్ 6 -- భారీ అంచనాలతో థియేటర్లలోకి రావాల్సిన అఖండ 2 రిలీజ్ కొన్ని గంటల ముందే ఆగిపోయింది. ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తూ ప్రొడ్యూసర్లు అనూహ్య నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సిన అఖండ 2 విడుదల వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ పై లేటెస్ట్ బజ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ అఖండ 2. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం, డిసెంబర్ 5న ఈ సినిమా విడుదల కావాల్సింది. అయితే షెడ్యూల్ ప్రకారం ఈ మూవీ రిలీజ్ కావడం లేదని గురువారం అర్ధరాత్రి చిత్ర నిర్మాతలు అనూహ్య ప్రకటన చేశారు. అయితే ఈ సినిమాను డిసెంబర్ లోనే థియేటర్లలోకిి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 25న ఈ సినిమాను రిలీజ్ చేస్తారని టాక్. ఆ రోజు కచ్చితంగా విడుదల చేసేలా ప్లాన్ చ...