Hyderabad, జూలై 1 -- అందరి ఆయుష్షులు చెప్పడానికి వచ్చేస్తున్నాడు టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్. అతడు నటిస్తున్న మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చిరంజీవ ఆహా వీడియో ఓటీటీలోకి రాబోతోంది. గతేడాది నవంబర్లో ఈ సిరీస్ ను ఆ ఓటీటీ అనౌన్స్ చేసింది. ఇప్పుడు మరోసారి దీనిపై కీలకమైన అప్డేట్ ఇచ్చింది.

రాజ్ తరుణ్ లీడ్ రోల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ చిరంజీవ. ఈ సిరీస్ త్వరలోనే రాబోతోందంటూ ఓ పోస్టర్ ను మంగళవారం (జులై 1) ఆహా వీడియో ఓటీటీ తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసింది. "అందరి ఆయుష్షు అతి త్వరలోనే చెప్పేస్తాం.. చిరంజీవ టీజర్ త్వరలోనే రానుంది" అనే క్యాప్షన్ తో ఈ పోస్టర్ ను తీసుకొచ్చారు.

ఆ పోస్టర్ పై కూడా నెక్ట్స్ బకెట్ తన్నేసేది ఎవరు అనే క్యాప్షన్ ఉంచడం విశేషం. ఈ పోస్టర్ లో రాజ్ తరుణ్ తోపాటు ఓ టైమర్ కూడా కనిపిస్తోంది. దానిపై ఇంకా భూమిపై ఉండటానికి ఎంత సమయం మి...