భారతదేశం, జనవరి 29 -- మరో బిగ్ బాస్ ఫేమ్ హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అతని పేరు అమర్‌దీప్ చౌదరి. అతడు నటించిన మూవీ సుమతీ శతకం. ఈ సినిమా ట్రైలర్ ను గురువారం (జనవరి 29) రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అమర్‌దీప్ మాట్లాడుతూ.. తాను హీరోగా ఎందుకు వస్తున్నానో ఈ సినిమా చూస్తే తెలుస్తుందని అనడం విశేషం.

అమర్‌దీప్, శైలి లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ సుమతీ శతకం. ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఈ మూవీ ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఈ లాంచ్ ఈవెంట్లో అమర్‌దీప్ మాట్లాడాడు. "నేను చాలా చిన్న స్థాయి నుంచి వచ్చాను. నాది అనంతపురం. అక్కడి నుంచి చిన్నగా మొదలుపెట్టి అలా అలా పైకి ఎదిగాను. మీకు రామ్ గా పరిచయం అయ్యాను. ఆల్రెడీ ఇంత మంది హీరోలు ఉన్నారు నువ్వెందుకురా అనుకోవచ్చు. నేను ఎందుకో ఈ సినిమాలో ఫుల్ సమాధానం ఉంది. ఇది కాదు లేదు అంటే అప్పుడు మాట్లాడండి బ్రదర్. అప్పుడు ...