భారతదేశం, ఫిబ్రవరి 14 -- కేరళ థ్రిస్సూర్​ జిల్లా​లో విషాదకర సంఘటన చోటుచసుకుంది. ఓ ఆలయ ఉత్సవాల్లో రెండు ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరో 30మందికి గాయాలయ్యాయి.

కోయిలండి కురువాంకడులోని మనకులంగర ఆలయంలో ఈ ఘటన జరిగింది. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలోకి ఏనుగులను తీసుకొచ్చారు. అయితే, ఏనుగులకు సమీపంలోనే బాణాసంచా పేల్చడం మొదలుపెట్టారు. టపాసుల ఆ శబ్దాలను ఏనుగులను భరించలేకపోయాయి. ఒక ఏనుగు మరో ఏనుగు మీదపడింది. ఆ తర్వాత రెండు ఏనుగులు పరుగులు తీశాయి.

ఏనుగల నుంచి తప్పించుకునేందుకు ఆలయంలోని ప్రజలు అనేక విధాలుగా ప్రయత్నించారు. ఫలితంగా ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. వారు.. 65ఏళ్ల లీల, 70ఏళ్ల అమ్ముకుట్టి అమ్మ, రంజన్​. ఇదే ఘటనలో మరో 30మంది గాయపడ్డారు.

కాగా ఈ ఘటనపై స్పందించిన మావటి.. ఏనుగులను అదుపు చేశారు. ...