భారతదేశం, ఆగస్టు 4 -- ఆర్​ఆర్బీలు గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల కోసం నిర్వహించిన ఆర్​ఆర్బీ ఎన్​టీపీసీ 2025 పరీక్ష ఫలితాలను త్వరలో విడుదల చేయనున్నాయి. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను విడుదలైన తర్వాత సంబంధిత ప్రాంతీయ ఆర్​ఆర్బీల అధికారిక వెబ్‌సైట్ల నుంచి చూసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

గతంలో బోర్డు ఆర్​ఆర్బీ ఎన్​టీపీసీ ఆన్సర్ కీ 2025ని విడుదల చేసింది. ఈ తాత్కాలిక ఆన్సర్ కీపై అభ్యంతరాలు ఉంటే జూలై 6, 2025 లోపు తెలియజేయాలని కోరింది. ఆన్సర్ కీని సవాలు చేయాలనుకున్న అభ్యర్థులు ఒక్కో ప్రశ్నకు రూ.50 తో పాటు వర్తించే బ్యాంక్ సర్వీస్ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.

అభ్యంతరాలు సరైనవని తేలితే, చెల్లించిన రుసుము వర్తించే బ్యాంక్ ఛార్జీలను మినహాయించుకొని అభ్యర్థికి తిరిగి చెల్లిస్తామని ఆర్​ఆర్బీలు తెలిపాయి. రీఫండ్ అభ్యర్థి ఆన్‌లైన్ చెల్లింపు చ...