భారతదేశం, జూన్ 1 -- రైల్వే రిక్రూట్​మెంట్ బోర్డు జూన్ 5 నుంచి ఆర్ఆర్బీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (గ్రాడ్యుయేట్) పరీక్షలను నిర్వహించనుంది. అంతకు ముందు బోర్డు అడ్మిట్ కార్డును విడుదల చేస్తుంది. సంబంధిత వర్గాల ప్రకారం ఆర్​ఆర్బీ ఎన్​టీపీసీ 2025 అడ్మిట్​ కార్డులు జూన్​ 1 లేదా 2వ తేదీల్లో అందుబాటులోకి వస్తాయి. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్ టికెట్లను ప్రాంతీయ ఆర్ఆర్బీల అధికారిక వెబ్సైట్ల నుంచి డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.

అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఆర్​ఆర్బీ ఎన్​టీపీసీ పరీక్ష తేదీకి నాలుగు రోజుల ముందు హాల్ టికెట్లను అందుబాటులో ఉంచుతారు.

"ఎగ్జామ్​ సిటీ- డేట్​ ఇంటిమేషన్​ లింక్​లో పేర్కొన్ని పరీక్ష తేదీకి 4 రోజుల ముందు ఈ-కాల్​ లెటర్స్​ని డౌన్​లోడ్​ చేసుకోవచ్చు," అని నోటిఫికేషన్​లో ఉంది.

ఎగ్జామ్​ సిటీ- తేదీ, ఎస్సీ / ఎస్టీ అభ్యర్థుల కోస...