భారతదేశం, మే 15 -- రీసెంట్ గా లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ లో 'ఆర్ఆర్ఆర్' లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ జరిగింది. 'బాహుబలి 2' తర్వాత ఈ ఘనత దక్కించుకున్న రెండో తెలుగు సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. దీంతో ఆర్ఆర్ఆర్ పేరు మరోసారి ప్రపంచ స్థాయిలో మార్మోగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్ పార్ట్ 2 గురించి చర్చ జోరందుకుంది. దీనిపై తాజాగా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి రియాక్షన్ వైరల్ గా మారింది.

రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ఆర్ఆర్ఆర్ లైవ్ కాన్సర్ట్ సందర్భంగా అమేజింగ్ మూమెంట్స్ కలిగిన వీడియోను రామ్ చరణ్ తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. ఇందులో రామ్ చరణ్, రాజమౌళి, ఎన్టీఆర్ కలిసి ఉన్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి రాజమౌళిని ఆట పట్టించారు. గిలిగింతలు పెట్టారు. ఆ సమయంలోనే వీడియో తీస్తున్న రామ్ చరణ్ భార్య ఉపాసన ఓ ప్రశ్న అడిగారు.

''రాజమౌళి గారు మీరు ఆర్ఆర...