భారతదేశం, జనవరి 12 -- డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ కామెడీ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు.

భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో బ్యూటిపుల్ డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించారు. ఇప్పటికే విడుదలైన భర్త మహాశయులకు విజ్ఞప్తి టీజర్, ట్రైలర్, పాటలతో హ్యుజ్ బజ్‌ను సృష్టించింది. ఈ సినిమా జనవరి 13న సంక్రాంతి సందర్భంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్‌గా భర్త మహాశయలకు విజ్ఞప్తి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ పవన్ బాసంసెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

డైరెక్టర్ పవన్ మాట్లాడుతూ.. "నేను రవితేజ గారికి పెద్ద ఫ్యాన్. ఆయన నాకు ఇన్సిపిరే...