భారతదేశం, జనవరి 29 -- బ్యాడ్మింటన్‌లో ఒలింపిక్స్ లో తొలి మెడల్ అందించి భారతీయులంతా గర్వపడేలా చేసిన ప్లేయర్ సైనా నెహ్వాల్. ఆమె ఈ మధ్యే ఆటకు గుడ్ బై చెప్పింది. అయితే ఐదేళ్ల కిందటే సైనా బయోపిక్ తెరకెక్కిన విషయం తెలిసిందే. అందులో లీడ్ రోల్లో నటించిన పరిణీతి చోప్రా తనను ఇన్‌స్టాగ్రామ్ లో ఎందుకు ఫాలో కావడం లేదో తాజాగా సైనా వివరించింది.

2021లో వచ్చిన 'సైనా' బయోపిక్ సినిమాలో సైనా నెహ్వాల్ పాత్రలో పరిణీతి చోప్రా మెప్పించింది. అయితే సైనా నెహ్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిణీతిని ఫాలో అవుతున్నప్పటికీ.. పరిణీతి మాత్రం సైనాను తిరిగి ఫాలో అవ్వడం లేదని నెటిజన్లు గుర్తించారు. నిజానికి సైనా కూడా పరిణీతిని ఫాలో కావడం లేదు. దీనిపై ఒక యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ సైనా స్పందించింది.

ఈ విషయంపై సైనా మాట్లాడుతూ.. "నిజానికి నేను ఈ విషయాన్ని ఎప్పుడూ గమనించలేదు. నా ట...