భారతదేశం, ఫిబ్రవరి 4 -- సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై, ముఖ్యంగా హీరోయిన్లు, ఇతర నటీమణులపై జరుగుతున్న ఆన్‌లైన్ దాడులు, వేధింపులు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. తాజాగా తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బకు ఇటువంటి చేదు అనుభవం ఎదురైంది. తన పట్ల ఆన్‌లైన్‌లో అసభ్యకరంగా ప్రవర్తించారంటూ ఆమె హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది.

ఏఎన్ఐ (ANI) వార్తా సంస్థ సమాచారం ప్రకారం.. ఈషా రెబ్బ ఇటీవల తన సినిమా ఓం శాంతి శాంతి శాంతి: ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఒక సోషల్ మీడియా/మీమ్ పేజీలో ఒక వ్యక్తి తన పట్ల అత్యంత జుగుప్సాకరమైన, లైంగిక వేధింపులకు గురిచేసేలా, పరువు నష్టం కలిగించేలా ఒక కామెంట్ పోస్ట్ చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

సదరు వ్యక్తి ఉపయోగించిన భాష చాలా అభ్యంతరకరంగా ఉందని, ఇది తనను మానసికంగా తీవ్ర వేదనకు గురిచేసిందని ఈషా ఆవేదన వ్యక్తం చేసింది...