భారతదేశం, ఫిబ్రవరి 2 -- మారుతున్న ప్రయాణం.. మారుతున్న అలవాట్లు ఒకప్పుడు కారు కొనాలంటే మైలేజీ ఎంత అని అడిగేవారు. కానీ ఇప్పుడు సిటీ ట్రాఫిక్ పుణ్యమా అని "ఆటోమేటిక్ వెర్షన్ ఉందా?" అని అడుగుతున్నారు. గంటల తరబడి ట్రాఫిక్‌లో పదే పదే క్లచ్ నొక్కడం, గేర్లు మార్చడం వంటి తలనొప్పి లేకుండా ప్రశాంతంగా ప్రయాణించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అయితే, ఈ సౌకర్యం వెనుక మనం తెలియక చేసే కొన్ని చిన్న పొరపాట్లు భవిష్యత్తులో భారీ మెకానికల్ రిపేర్లకు దారితీస్తాయని మీకు తెలుసా?

ఎందుకు అందరూ ఆటోమేటిక్ వైపు మొగ్గు చూపుతున్నారు? గత ఐదేళ్లలో భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఆటోమేటిక్ కార్ల విక్రయాలు దాదాపు 30% పెరిగాయి. ముఖ్యంగా రూ. 10 లక్షల లోపు బడ్జెట్‌లో కూడా విభిన్న రకాల ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు అందుబాటులోకి రావడం ఒక ప్రధాన కారణం. కానీ, మ్యాన్యువల్ కారును డ్రైవ్ ...